HYDERABAD · WED, 23 SEPTహైదరాబాద్ · 23 సెప్టెం, బుధTelugu news, at internet speedతెలుగు వార్తలు, ఇంటర్నెట్ వేగంతో
BREAKINGబ్రేకింగ్
48 Years of Megastar Chiranjeeviమెగాస్టార్ చిరంజీవికి 48 ఏళ్లు: ప్రాణం ఖరీదు నుంచి టాలీవుడ్ పాలన వరకు!Anil Ravipudi Claps For Peddagattu Jathara Movie Launchఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1 ‘పెద్దగట్టు జాతర’ ప్రారంభం: ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన అనిల్ రావిపూడిFahadh Faasil's Don't Trouble The Trouble Official Trailer Review &ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అఫీషియల్ ట్రైలర్ రివ్యూ & రెస్పాన్స్Telangana’s Anti-Narcotics Efforts Earn National Recognitionకేంద్ర ప్రమాణాల్లో 80%కు పైగా స్కోరు సాధించిన తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ వ్యవస్థకు జాతీయ గుర్తింపుMiss India Runner-Up Manasa Varanasi Pairs Up With Sharwanand in Sreenuశర్వానంద్, శ్రీను వైట్ల కాంబో 'జార్జ్ క్రిష్'లో హీరోయిన్‌గా మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిKamal Haasan Watches Mandaadi & Appreciates Suhasమండాడి సినిమాను చూసి సుహాస్‌ను అభినందించిన కమల్ హాసన్UPI Train Ticket Charges Above Rs 2000: Key Details on the MDR Feeరూ. 2000 పైబడిన యుపిఐ రైలు టికెట్ ఛార్జీలు: ఎమ్‌డిఆర్ ఫీజు గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలుPawan Kalyan Returns To AP Cabinet Meeting After Long Gapసుదీర్ఘ విరామం తర్వాత ఏపీ కేబినెట్ భేటీకి పవన్ కల్యాణ్Yash's Toxic Final Worldwide Box Office: Closing Numbers!యశ్ 'టాక్సిక్' ఫైనల్ వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: షాకింగ్ క్లోజింగ్ నంబర్స్!EAGLE Force Telangana: Elite Action Group for Drug Law Enforcementఈగల్ ఫోర్స్ తెలంగాణ: మాదకద్రవ్యాల చట్ట అమలు కోసం ఏర్పాటు చేసిన 'ఎలైట్ యాక్షన్ గ్రూప్' (Elite Action Group)The Paradise Multi-Language Release Strategyది ప్యారడైజ్ మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్ స్ట్రాటజీ: తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర భాషల విడుదల వివరణNiharika Konidela Beats The Odds!నిహారిక కొణిదెల విజయం! సోషల్ మీడియా ట్రోల్స్ నుండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్‌గా మారిన ప్రయాణంAP Nandi Awards Are BackAP నంది అవార్డులు మళ్లీ ప్రారంభం: 2025 Film & TV Awards Entries Open | దరఖాస్తు గైడ్Trump Bans the Word "AI"AI ఇక లేదు.. ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అంటున్న ట్రంప్Indiramma Housing Scheme 2026: Benefits, Costs and Eligibilityఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ 2026: ఏవి ఉచితం, లబ్ధిదారులు ఎంత చెల్లించాలి, తెలంగాణలో ఎవరు అర్హులు కావచ్చుThe Paradise North America Pre Sales Hit $1M Without A Trailer Madnessది ప్యారడైజ్ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ట్రైలర్ లేకుండానే $1 మిలియన్ మార్కును దాటి సంచలనంThe Paradise Day 1 Box Office PredictionThe Paradise Day 1 Box Office Prediction: నేచురల్ స్టార్ నాని తన కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్Aadarsha Kutumbam Postponedఆదర్శ కుటుంబం వాయిదా: వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ 9కి ఎందుకు మారింది!72nd National Film Awards Telugu Winners Full List72వ జాతీయ చలనచిత్ర అవార్డుల తెలుగు విజేతల పూర్తి జాబితా: కల్కి 2898 AD, పుష్ప 2 & కమిటీ కుర్రోళ్లుYami Gautam Wins Best Actress for Article 370 at National Film Awardsజాతీయ చలనచిత్ర అవార్డులు 2026: 'ఆర్టికల్ 370' చిత్రానికి ఉత్తమ నటిగా యామీ గౌతమ్ విజయంMammootty & Kartik Aaryan Share Best Actor at 72nd National Film Awards!72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ సంయుక్త విజయం!Why 72nd National Film Awards Left New Delhi for Gujarat This Year72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక ఈ ఏడాది న్యూఢిల్లీ నుండి గుజరాత్‌కు ఎందుకు మారింది?72nd National Film Awards: Complete Winners List & Highlights72వ జాతీయ చలనచిత్ర అవార్డులు: విజేతల పూర్తి జాబితా మరియు ముఖ్యాంశాలుHyderabad GCC Expansion Ahead of Schedule, Revanth Reddy Saysహైదరాబాద్ GCC విస్తరణ లక్ష్యానికి ముందుగానే పురోగతి, రేవంత్ రెడ్డి వెల్లడి: లక్ష్యాలు, కంపెనీలు, తెలంగాణ తదుపరి వ్యూహం48 Years of Megastar Chiranjeeviమెగాస్టార్ చిరంజీవికి 48 ఏళ్లు: ప్రాణం ఖరీదు నుంచి టాలీవుడ్ పాలన వరకు!Anil Ravipudi Claps For Peddagattu Jathara Movie Launchఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1 ‘పెద్దగట్టు జాతర’ ప్రారంభం: ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన అనిల్ రావిపూడిFahadh Faasil's Don't Trouble The Trouble Official Trailer Review &ఫహాద్ ఫాజిల్ 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' అఫీషియల్ ట్రైలర్ రివ్యూ & రెస్పాన్స్Telangana’s Anti-Narcotics Efforts Earn National Recognitionకేంద్ర ప్రమాణాల్లో 80%కు పైగా స్కోరు సాధించిన తెలంగాణ యాంటీ-నార్కోటిక్స్ వ్యవస్థకు జాతీయ గుర్తింపుMiss India Runner-Up Manasa Varanasi Pairs Up With Sharwanand in Sreenuశర్వానంద్, శ్రీను వైట్ల కాంబో 'జార్జ్ క్రిష్'లో హీరోయిన్‌గా మిస్ ఇండియా రన్నరప్ మానస వారణాసిKamal Haasan Watches Mandaadi & Appreciates Suhasమండాడి సినిమాను చూసి సుహాస్‌ను అభినందించిన కమల్ హాసన్UPI Train Ticket Charges Above Rs 2000: Key Details on the MDR Feeరూ. 2000 పైబడిన యుపిఐ రైలు టికెట్ ఛార్జీలు: ఎమ్‌డిఆర్ ఫీజు గురించి మీరు తెలుసుకోవలసిన పూర్తి వివరాలుPawan Kalyan Returns To AP Cabinet Meeting After Long Gapసుదీర్ఘ విరామం తర్వాత ఏపీ కేబినెట్ భేటీకి పవన్ కల్యాణ్Yash's Toxic Final Worldwide Box Office: Closing Numbers!యశ్ 'టాక్సిక్' ఫైనల్ వరల్డ్‌వైడ్ బాక్సాఫీస్ కలెక్షన్: షాకింగ్ క్లోజింగ్ నంబర్స్!EAGLE Force Telangana: Elite Action Group for Drug Law Enforcementఈగల్ ఫోర్స్ తెలంగాణ: మాదకద్రవ్యాల చట్ట అమలు కోసం ఏర్పాటు చేసిన 'ఎలైట్ యాక్షన్ గ్రూప్' (Elite Action Group)The Paradise Multi-Language Release Strategyది ప్యారడైజ్ మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్ స్ట్రాటజీ: తెలుగు, హిందీ, తమిళం మరియు ఇతర భాషల విడుదల వివరణNiharika Konidela Beats The Odds!నిహారిక కొణిదెల విజయం! సోషల్ మీడియా ట్రోల్స్ నుండి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ విన్నర్‌గా మారిన ప్రయాణంAP Nandi Awards Are BackAP నంది అవార్డులు మళ్లీ ప్రారంభం: 2025 Film & TV Awards Entries Open | దరఖాస్తు గైడ్Trump Bans the Word "AI"AI ఇక లేదు.. ‘సూపర్ ఇంటెలిజెన్స్’ అంటున్న ట్రంప్Indiramma Housing Scheme 2026: Benefits, Costs and Eligibilityఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ 2026: ఏవి ఉచితం, లబ్ధిదారులు ఎంత చెల్లించాలి, తెలంగాణలో ఎవరు అర్హులు కావచ్చుThe Paradise North America Pre Sales Hit $1M Without A Trailer Madnessది ప్యారడైజ్ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ట్రైలర్ లేకుండానే $1 మిలియన్ మార్కును దాటి సంచలనంThe Paradise Day 1 Box Office PredictionThe Paradise Day 1 Box Office Prediction: నేచురల్ స్టార్ నాని తన కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్Aadarsha Kutumbam Postponedఆదర్శ కుటుంబం వాయిదా: వెంకటేష్, త్రివిక్రమ్ సినిమా అక్టోబర్ 9కి ఎందుకు మారింది!72nd National Film Awards Telugu Winners Full List72వ జాతీయ చలనచిత్ర అవార్డుల తెలుగు విజేతల పూర్తి జాబితా: కల్కి 2898 AD, పుష్ప 2 & కమిటీ కుర్రోళ్లుYami Gautam Wins Best Actress for Article 370 at National Film Awardsజాతీయ చలనచిత్ర అవార్డులు 2026: 'ఆర్టికల్ 370' చిత్రానికి ఉత్తమ నటిగా యామీ గౌతమ్ విజయంMammootty & Kartik Aaryan Share Best Actor at 72nd National Film Awards!72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ సంయుక్త విజయం!Why 72nd National Film Awards Left New Delhi for Gujarat This Year72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుక ఈ ఏడాది న్యూఢిల్లీ నుండి గుజరాత్‌కు ఎందుకు మారింది?72nd National Film Awards: Complete Winners List & Highlights72వ జాతీయ చలనచిత్ర అవార్డులు: విజేతల పూర్తి జాబితా మరియు ముఖ్యాంశాలుHyderabad GCC Expansion Ahead of Schedule, Revanth Reddy Saysహైదరాబాద్ GCC విస్తరణ లక్ష్యానికి ముందుగానే పురోగతి, రేవంత్ రెడ్డి వెల్లడి: లక్ష్యాలు, కంపెనీలు, తెలంగాణ తదుపరి వ్యూహం
TOLLYWOODటాలీవుడ్

Anil Ravipudi Claps For Peddagattu Jathara Movie Launch | RK Reddy Films Production No 1ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం.1 ‘పెద్దగట్టు జాతర’ ప్రారంభం: ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టిన అనిల్ రావిపూడి

Director Anil Ravipudi launched the debut movie of actor Viransh, directed by Vijay Kumar C.H. and produced under the…ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ‘పెద్దగట్టు జాతర’ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంతో విరాన్ష్ కథానాయకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. చిత్ర పరిశ్…

TEతెTeluguRise Teamతెలుగురైజ్ టీమ్23 Sept 2026 · 2 min read23, సెప్టెం 2026 · 2 నిమిషాల చదువుTollywoodటాలీవుడ్
Director Anil Ravipudi at the official movie launch of Peddagattu Jathara produced by RK Reddy Films.

ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతున్న ‘పెద్దగట్టు జాతర’ చిత్రం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంతో విరాన్ష్ కథానాయకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు. చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవ వేడుకకు విచ్చేసి చిత్ర బృందానికి తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. అదే సమయంలో సినిమా టైటిల్ పోస్టర్‌ను అధికారికంగా ఆవిష్కరించారు.

ఘనంగా జరిగిన పూజా కార్యక్రమాలు

సినిమా ప్రారంభోత్సవంలో భాగంగా చిత్ర యూనిట్ ప్రత్యేక పూజలు నిర్వహించింది. అనిల్ రావిపూడి క్లాప్ కొట్టగా, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దేవి శ్రీ గురూజీ కెమెరా స్విచ్ ఆన్ చేసి చిత్రీకరణను ప్రారంభించారు. సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ చిత్ర స్క్రిప్ట్‌ను దర్శకుడు, నిర్మాతలకు అందజేసి, ఈ సినిమా భారీ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ చిత్రాన్ని నిర్మాత ఎ. రామ కృష్ణ రెడ్డి ఆర్‌కే రెడ్డి ఫిల్మ్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వైవిధ్యమైన కథాంశంతో, సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

దర్శకుడు విజయ్ కుమార్ సి.హెచ్. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వినోదం, భావోద్వేగాల కలయికతో ఈ కథ సాగుతుందని చిత్ర యూనిట్ పేర్కొంది. గ్రామీణ నేపథ్యం, జాతర వాతావరణం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

ఈ చిత్రంలో విరాన్ష్ సరసన నటించే నటీనటులతో పాటు దేవి ప్రసాద్, మీనా కుమారి, సత్యకృష్ణ, సురేఖా వాణి, ‘బాహుబలి’ ప్రభాకర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, అజయ్ ఘోష్, నాగమహేష్, బలగం రమేష్, లౌక్య తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

సాంకేతిక విభాగంలో నాగార్జున సినిమాటోగ్రాఫర్‌గా, గిరీష్ దేవాంగ్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రముఖ సినీ గేయ రచయితలు సుద్దాల అశోక్ తేజ, కాసరల శ్యామ్ ఈ చిత్రానికి సాహిత్య ప్రదానం చేస్తున్నారు.

ఈ చిత్రానికి కో-డైరెక్టర్‌గా అర్జున్ మొగలిపాక, చీఫ్ అసోసియేట్‌గా టి. నాగేంద్ర పనిచేస్తున్నారు. వంశీ-శేఖర్ పీఆర్‌ఓలుగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Share this article · షేర్ చేయండి